అనంతపురం జిల్లా కల్యాణదుర్గం అధికార పార్టీ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.మంత్రి ఉషాశ్రీ చరణ్, ఎంపీ తలారి వర్గీయుల మధ్య వివాదం రాజుకుంది.
ఈ క్రమంలోనే భూవివాదంతో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ భర్త హరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.ఈ ఘటనను అడ్డుకున్న పోలీసులు అతనిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అయితే ఎంపీ తలారి అనుచరుడు తన భూమిని ఆక్రమించుకున్నాడని హరి ఆరోపిస్తున్నాడు.దీంతో రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య వివాదం కొనసాగుతోంది.
దీంతో కల్యాణదుర్గంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.