తెలంగాణ సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి( Komatireddy Venkatreddy ) కోపం వచ్చింది.తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టాలీవుడ్ కు( Tollywood ) చెందిన ప్రముఖులంతా తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వస్తారని, కనీసం ఫోన్ చేసైనా విషెస్ చెబుతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావించారు.
అయితే టాలీవుడ్ ప్రముఖులు ఎవరు పెద్దగా స్పందించకపోవడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి మాత్రమే శుభాకాంక్షలు చెప్పడం వంటి వ్యవహారాలపై తీవ్ర ఆగ్రహంతో వెంకటరెడ్డి ఉన్నారు.
సినిమాటోగ్రఫీ మంత్రిగా( Cinematography Minister ) ఉన్న తనను పట్టించుకోకపోవడం, తనకు కనీసం శుభాకాంక్షలు చెప్పేందుకు ఎవరు ఆసక్తి చూపించకపోవడం, టాలీవుడ్ ప్రముఖులపై వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా వెంకటరెడ్డి బయట పెట్టారు.తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ విషయంపై స్పందించారు.నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నిర్మాత దిల్ రాజు( Producer Dil Raju ) ఒక్కరే తనకు శుభాకాంక్షలు తెలిపారని , ఇండస్ట్రీ నుంచి ఎవరు శుభాకాంక్షలు తెలియజేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
” ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో చూస్తా. త్వరలోనే అన్ని లెక్కలు తేలుస్తా ” అంటూ తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు.దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టాలీవుడ్ ఫై సీరియస్ గా ఉన్నారని అర్థమవుతుంది.
ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ వ్యవహారంపై సీరియస్ గా ఉండటమే కాకుండా , దీనిపై అసలు నిజాలను నిగ్గు తేల్చాలని అధికారులను ఆదేశించారు.గత బిఆర్ఎస్ ( BRS )ప్రభుత్వ హయాంలో బయటపడిన డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ కు చెందిన అనేక మందికి సంబంధాలు ఉండడం,
అప్పట్లోనే రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దీనిపై కోర్టులో పిటిషన్లు వేయడం, పోరాటాలు చేయడం వంటివి చోటుచేసుకున్నాయి.అప్పట్లో ఆ వ్యవహారాన్ని బీఆర్ఎస్ పెద్దలు గప్ చుప్ చేయడంతో, ఇప్పుడు దానిని బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం టాలీవుడ్ పై ఆగ్రహంతో ఉండడంతో, ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ కి చెందిన వారు ఎలా రియాక్ట్ అవుతారో ? ఏ విధంగా మంత్రి గారి ఆగ్రహాన్ని చల్లారుస్తారో చూడాలి.