మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గత నాలుగు సినిమాలలో ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.తక్కువ సమయంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమాలు షాకింగ్ ఫలితాలను అందుకోవడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.
ఈ మూడు సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించకపోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అయితే ఈ మూడు సినిమాలలో ఒక వ్యక్తి నటించాడని అతని వల్లే సినిమా ఫ్లాపైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మెగా ఫ్యామిలీకి చెందిన కొణిదెల పవన్ తేజ్ ( Konidela Pawan Tej )మెగాస్టార్ దయ వల్ల చిరంజీవి నటిస్తున్న సినిమాలలో అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు.ఈ మూడు సినిమాలలో పెద్దగా గుర్తింపు లేని పాత్రలలో కొణిదెల పవన్ తేజ్ నటించారు.
అయితే సినిమాలు ఫ్లాప్ కావడంతో చిరంజీవి తన సినిమాలలో కొణిదెల పవన్ తేజ్ ను ఎంచుకోవద్దని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
అయితే మెగాస్టార్ చిరంజీవి సెంటిమెంట్లను పెద్దగా పట్టించుకోరు.కొణిదెల పవన్ తేజ్ కు చిరంజీవి తర్వాత సినిమాలలో అవకాశం దక్కుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.చిరంజీవి సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఆ రేంజ్ లో కలెక్షన్లు రావడం లేదు.
చిరంజీవి తన సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సినిమాలు హిట్టయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
చిరంజీవి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.జయాపజయాలతో సంబంధం లేకుండా చిరంజీవి కెరీర్ ను కొనసాగిస్తున్నారు.చిరంజీవిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.
చిరంజీవి త్వరలో కొత్త సినిమాలను ప్రకటించనుండగా ఆ సినిమాలు భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి.చిరంజీవి సినిమాలకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరుగుతుండటం గమనార్హం.
మెగాస్టార్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.