మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) నటించి ఆ మధ్య విడుదల అయిన భోళా శంకర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఉంటే ఇప్పటికే బ్రో డాడీ సినిమా రీమేక్ షూటింగ్ మొదలు పెట్టి, ముగించే వారు.కానీ రీమేక్ ల విషయం లో నిర్ణయాన్ని మార్చుకున్న మెగా ఫ్యామిలీ మెంబర్స్ కొత్త కథ కోసం వెయిట్ చేశారు.
బింబిసార దర్శకుడు వశిష్ఠ తో సినిమా కు కథ రెడీ అయింది.ఇప్పటికే అధికారికంగా సినిమా ను ప్రకటించారు.

ప్రీ లుక్ కూడా విడుదల చేయడం జరిగింది.అంతా బాగానే ఉంది కానీ షూటింగ్ విషయం లో మాత్రం అదిగో ఇదిగో అంటూ వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారు.చాలా కాలం గా చిరంజీవి ఒక అనారోగ్య సమస్య తో బాధ పడుతున్నాడు.ఎలాగూ సమయం లభించింది కదా అని విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నాడు.అందుకే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది.ఎట్టకేలకు సినిమా షూటింగ్ ను దర్శకుడు ప్రారంభించాడట.
కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు చిరంజీవి సెట్స్ లో అడుగు పెట్టలేదట.మూడు రోజులుగా జరుగుతున్న షూటింగ్ లో చిరంజీవి లేని సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నాడట.

ఇది ఎంత వరకు వెళ్తుంది అనేది క్లారిటీ లేదు.కానీ చిరంజీవి సెట్స్ లో వచ్చే నెలలో జాయిన్ అవ్వబోతున్నాడు అనేది మాత్రం యూనిట్ సభ్యుల( Unit members ) ద్వారా తెలుస్తోంది.చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నుంచి సోషియో ఫాంటసీ సినిమా( socio fantasy movie ) రాబోతుంది.బింబిసార వంటి విభిన్నమైన సోషియో ఫాంటసీ సినిమా ను రూపొందించిన దర్శకుడు వషిష్ఠ ఈ సినిమా తో మరోసారి మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకుని, చిరంజీవికి మరియు ఆయన అభిమానులకు హిట్ ఇస్తాడేమో చూడాలి.
చిరంజీవి మరి కొన్ని సినిమాల చర్చలు కూడా కొనసాగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.