రోబో డాగ్‌లతో చైనీయులు వాకింగ్.. ఎక్కడ చూసినా ఇవే

వాకింగ్ వెళ్లే సందర్భంలో కొందరు తమ పెంపుడు కుక్కలను తీసుకెళ్తుంటారు.అయితే చైనాలోనూ చాలా మంది ఇలా పెంపుడు కుక్కలతో వాకింగ్‌కు వెళ్తున్నారు.

 Chinese People Walking With Robot Dog They Are The Same Everywhere Chinese Peop-TeluguStop.com

అయితే ఇక్కడే ఓ కిటుకు ఉంది.అవి రోబోటిక్ కుక్కలు.

ప్రస్తుతం చైనా( China 0లో ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు వెళ్తూ ఆ రోబోటిక్ కుక్కలను వారు తమతో పాటు తీసుకెళ్తున్నారు.

చైనా నగరాలలోని దాదాపు ప్రతి కాలనీలలో ఇవే కనిపిస్తున్నాయి.షాంఘై నివాసి అయిన వు జియాంగ్యు ఒక రోబోట్ కుక్కకు యజమాని.

మరియు తన ఖాళీ సమయంలో కుక్కతో కలిసి వాకింగ్‌కు వెళ్లడం ఒక సాధారణ దినచర్యగా మారింది.అతడే కాకుండా చాలా మంది ఇలా రోబోటిక్ కుక్కలతో( Robot dogs, ) సహవాసం చేస్తున్నారు.

Telugu China, Chinese, Cyberdog, Latest, Robot Dogs, Xiaomi-Latest News - Telugu

షాంఘైలో, జుహుయ్ నదీతీరంలో కుక్కలతో వాకింగ్, జాగింగ్ ఎక్కువగా చేస్తుంటారు.డిసెంబర్ 2021లో ఒక రోజు, వూ తన రోబోట్ డాగ్‌ని మొదటిసారిగా అక్కడికి తీసుకెళ్లాలని ఎంచుకున్నాడు.

అలా వెళ్లగానే, రోబోటిక్ కుక్కను అక్కడి వారు ఆశ్చర్యంగా చూశారు.ఆ రోబోట్ కుక్కలను కలవడానికి తమ నిజమైన పెంపుడు కుక్కలను కూడా తీసుకువచ్చారు.క్రమంగా ఈ రోబోటిక్ కుక్కల వినియోగం పెరుగుతూ వచ్చింది.ప్రస్తుతం నగరాలలో చాలా కాలనీల్లో ఇవి కనిపిస్తున్నాయి.

వు తన పెంపుడు రోబోట్ కుక్కను సైబర్‌డాగ్( Cyberdog ) అని పిలుస్తారు.ఇది ఫోన్‌లకు అత్యంత ప్రసిద్ధి చెందిన చైనీస్ కంపెనీ Xiaomi అభివృద్ధి చేసింది.

ఈ రోబోటిక్ కుక్కలు పరిగెత్తగలవు.

Telugu China, Chinese, Cyberdog, Latest, Robot Dogs, Xiaomi-Latest News - Telugu

ఎడమ, కుడి వైపు మలుపులు తీసుకోగలవు.

ప్రజలను పలకరించగలవు.అంతేకాకుండా కరచాలనాలు కూడా చేస్తాయి.

ఇవి బ్యాక్‌ఫ్లిప్‌లను కూడా చేస్తాయి.ఈ రోబోటిక్ డాగ్‌కు తల భాగంలో కంపెనీలు కెమెరాలను అమర్చుతున్నాయి.

వీటి సాయంతో అవి తమ యజమానులను గుర్తు పడతాయి.వారి వాయిస్ కమాండ్‌ల ఆధారంగా ప్రతిస్పందిస్తాయి.

ఇవే కాకుండా తమ యజమాని కనిపించగానే సాధారణ కుక్కల మాదిరిగానే తోకలు ఊపుతాయి.భారత కరెన్సీలో వీటి ధర రూ.1.5 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube