తెలంగాణలో బీజేపీ కార్యక్రమాలకు పలువురు ముఖ్యనేతలు దూరంగా ఉన్నారు.ఈ క్రమంలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఈటలతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరియు ఏనుగు రవీందర్ రెడ్డిలు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
కాగా ఒకే రోజు 35 లక్షల కుటుంబాలను కలిసే విధంగా పార్టీ ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అయితే గత కొన్ని రోజులుగా ఈటల, రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఈటల మౌనంపై బీజేపీలో చర్చ జరుగుతోంది.