ఆటోలోనే తోట పెంచేస్తున్న చెన్నై.. వ్యక్తి వీడియో వైరల్..

భారతదేశంలో ప్రజా రవాణా చేసే వాహనాలలో ఆటో రిక్షాలు( Auto rickshaws ) ముందు వరుసలో ఉంటాయి.ఈ ఆటోలు చాలా మోడల్స్ లో వస్తుంటాయి.

 Chennai Man Growing Garden In Auto Video Of Man Goes Viral, Auto Rickshaw, Vira-TeluguStop.com

అయితే కొందరు ఆటో డ్రైవర్లు ప్రయాణికులకు మంచి అనుభూతిని అందించడానికి సొంతంగా వాటిని మాడిఫై చేసుకుంటారు.కొందరు వాటిని లగ్జరీ కార్ల వలె తీర్చిదిద్దుతారు మరికొందరు ప్రయాణికులకు ఉచితంగా తిను బండారాలను అందిస్తుంటారు.

ఆటోను విమానంలా మార్చిన డ్రైవర్లు కూడా ఇండియాలో ఉన్నారంటే వారి క్రియేటివిటీ ఏ లెవెల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.వాహనాలను ప్రత్యేకమైన రీతిలో డెకరేట్ చేసుకున్నప్పుడు అందరి దృష్టి వాటి పైనే పడుతుంటుంది.

తాజాగా చెన్నైలో ఒక డ్రైవర్ తన ఆటోలో ఏకంగా తోట( graden ) పెంచేస్తున్నాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసి వావ్, వాట్‌ ఏ ఐడియా అంటూ డ్రైవర్‌ను తెగ పొగిడేస్తున్నారు.ఈ డ్రైవర్ తన ఆటోలో కుండీలలోని మొక్కలు పెట్టాడు.మూలికలు, పువ్వులతో సహా 50 కంటే ఎక్కువ మొక్కలను ఉంచాడు.అంతేకాదు ప్రయాణికుల కోసం స్లిమ్ మోటివేషనల్ పుస్తకాలు, తాగునీటి సౌకర్యాన్ని అమర్చాడు.

అవయవ దానం, పర్యావరణ పరిరక్షణ వంటి కారణాలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూ అతను పోస్టర్లను కూడా ఉంచాడు.ఈ డ్రైవర్ పేరు కుబేంద్రన్( Kubendran ).అతను పదేళ్లుగా ఆటో రిక్షా నడుపుతున్నాడు.అతని ఆటోను ట్రావెలింగ్ పార్క్, మినీ గార్డెన్ అని ప్రజలు పిలుస్తున్నారు.

చాలామంది అతడి ప్రయత్నాలను ప్రశంసించారు.తన ఆటో ఇతరులను క్రియేటివ్ గా, పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాడు.

ఢిల్లీలోని మరో ఆటోడ్రైవర్ తన ఆటో పైకప్పుపై కిచెన్ గార్డెన్ పెంచాడు.ఈ తోట అతనిని, ప్రయాణీకులను మండే ఎండల నుంచి కాపాడుతుంది, వాహనం ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube