ప్రస్తుతం ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) దూకుడుగా ముందుకు వెళుతున్నారు.వారాహి యాత్ర ద్వారా ఇప్పటికే జనసేన గ్రాఫ్ పెరిగేలా పవన్ చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసి పోటీ చేయబోతుండడంతో, వీలైనంత ఎక్కువ సీట్లు గెలిచి కీలకంగా మారాలని పవన్ భావిస్తున్నారు .ఇక టిడిపితో పొత్తు పెట్టుకున్నా, తాము కోరినన్ని స్థానాలు ఇస్తే తప్ప పొత్తుకు అంగీకరించకూడదు అనే అభిప్రాయంతో పవన్ ఉండడంతో, టిడిపి డైలమాలో పడింది.కేవలం కొన్ని సీట్లు కేటాయించి జనసేనతో పొత్తు పెట్టుకుందాం అని టిడిపి భావించినా, పవన్ మాత్రం 45 స్థానాలు తమకు కేటాయించాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో, పవన్ దూకుడుకు బ్రేకులు వేసే విధంగా చంద్రబాబు వ్యవహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు.

బిజెపి తో చర్చలు పొత్తు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.ఇటీవల కాలంలో జనసేన, పవన్ గ్రాఫ్ పెరగడంతో.పవన్ ను కట్టడి చేయాలని, లేకపోతే పవర్ షేరింగ్ తెరపైకి వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
ఏపీలో బిజెపికి అంతగా బలం లేకపోయినా, వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగాలని బిజెపి భావిస్తోంది.ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు బిజెపికి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.15 శాసనసభ 5 ఎంపీ సీట్లు ఇస్తాననే ప్రతిపాదన పెట్టారట.అయితే ఏపీలో బిజెపికి అంతస్థాయిలో బలం లేకపోయినా , పవన్ దూకుడుకు బ్రేకులు వేసేందుకు చంద్రబాబు( Chandrababu Naidu ) ఈ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో పొత్తులు కుదిరితే 40 నుంచి 50 స్థానాలు జనసేన కోరే అవకాశం ఉంది.అన్ని స్థానాలు కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు .జనసేన ఎక్కువ స్థానాలను ఆశించకుండా బిజెపిని లైన్ లో పెడుతున్నట్లు అర్థమవుతుంది.

జనసేన బిజెపికి కలిపి మొత్తం 30 అసెంబ్లీ స్థానాలను మించి ఇవ్వకూడదని చంద్రబాబు భావిస్తున్నారు .అందుకే జనసేన( Jana sena )తో సమానంగా బిజెపికి సీట్లుకేటాయించి పవన్ ప్రభావాన్ని తగ్గించాలనే ఆలోచనతో ఉన్నారట.ఈ విషయంలో బిజెపి అగ్ర నేతలు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.







