హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహిస్తున్న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో గందరగోళం నెలకొంది.ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరికి ఏఐసీసీ ఓటు వేసే అవకాశం కల్పించింది.
ఈ నేపథ్యంలో ముందుగా జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య, శ్రీనివాస్ రెడ్డికి అవకాశం కల్పించింది.అనంతరం రాష్ట్ర నేతలు శ్రీనివాస్ రెడ్డి స్థానంలో ప్రతాప్ రెడ్డి పేరును చేర్చుతూ మార్పులు చేశారు.
అయితే ఆఖరి నిముషంలో కొమ్మూరి పేరు చేర్చడంపై పొన్నాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పోలింగ్ ఏజెంట్లపై మండిపడ్డారు.
ముందుగా నిర్ణయించినట్లే శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ క్రమంలో పొన్నాలకు మరో పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సర్దిచెప్పారు.