వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు పెద్ద షాక్ ఇచ్చారు.ఇతర రాష్ట్రాల వాహనాలు కొనుగోలు చేసిన వారంతా తప్పనిసరిగా టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్ మార్చాల్సిందేనని తెలిపారు.
లేని పక్షంలో సదరు వాహనాన్ని సీజ్ చేస్తామని వెల్లడించారు.ఇటీవల నగరంలో కొందరి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
కాగా, ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న వాహనాలకు అక్కడ ఎన్ఓసీ తీసుకుని లైఫ్ టాక్స్ కడితే సరిపోదని అధికారులు తేల్చి చెప్పారు.తెలంగాణలో కూడా టాక్స్ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని స్పష్టం చేశారు.







