ఏపీలోని వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్( Minister Gudivada Amarnath ) రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
వైసీపీతో తప్ప అన్ని పార్టీలతో చంద్రబాబు( Chandrababu ) పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు.చంద్రబాబుకు తోక పార్టీ కాంగ్రెస్( Congress ) అని ఆరోపించారు.
అలాగే పార్టీని వీడుతున్న నేతల వ్యవహారంపై స్పందించిన ఆయన పార్టీ ఎవరినీ వదులుకోదని చెప్పారు.
అయినా వెళ్లారంటే అది వారిష్టమని పేర్కొన్నారు.జగన్( CM Jagan ) తనకు ఎన్నో పదవులు ఇచ్చారన్న మంత్రి గుడివాడ జగన్ మళ్లీ సీఎం కావడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని తెలిపారు.అలాగే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని తెలిపారు.