టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.పార్టీలో పని చేయని నేతలకు స్థానం ఉండదని హెచ్చరించారు.
పార్టీ కోసం పని చేయని వారుంటే ఇప్పుడే తప్పుకోవాలని చంద్రబాబు సూచించారు.పని చేయలేని నాయకులు ఉంటే ముందే చెప్పాలన్నారు.
ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ నాయకులను చూసుకుంటామని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసేలా నాయకులు సిద్ధంగా ఉండాలని, గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెల్లడించారు.