అమరావతిలోని కుంచనపల్లి సిట్ కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబును తరలించారు.ఈ క్రమంలో సీఐడీ అధికారులు ఆయనను మరోసారి ప్రశ్నించనున్నారు.
అనంతరం వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి చంద్రబాబును తీసుకెళ్లనున్నారు అధికారులు.వైద్య పరీక్షలు పూర్తైన తరువాత ఏసీబీ కోర్టులో హజరుపరచనున్నారు.
కాగా చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు.ఇటు సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్, వివేకానంద వాదనలు వినిపించనున్నారని సమాచారం.
మరోవైపు కుంచనపల్లి సిట్ కార్యాలయం ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.