టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఎంపీ మోపిదేవి వెంకటరమణ విమర్శలు గుప్పించారు.ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు అరెస్ట్ అయ్యారని తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ మోపిదేవి అన్నారు.న్యాయమూర్తి హిమబిందుతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని చెప్పారు.
న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్న వారిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం బాధాకరమని తెలిపారు.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.