జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్స్ కేటగిరీలో గతంలో కేంద్ర ఎన్నికల సంఘం చేర్చింది.జనసేన( Jana sena )కు ఓటింగ్ శాతం తక్కువగా రావడం, కనీస సీట్లను సంపాదించుకోలేకపోవడంతో , గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్స్ కేటగిరిలో పెట్టారు.
దీంతో జనసేనకు వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు ఉండదని, జనసేన అభ్యర్థులకు ఒక్కోచోట ఒక్కో సింబల్ వస్తుందని అంత భావించారు.ఇదే విషయంపై వైసీపీ నాయకులు పదేపదే జనసేన పై విమర్శలు చేస్తున్నారు.
కనీసం పార్టీ గుర్తును కూడా కాపాడుకోలేకపోయారని ఎద్దేవా చేస్తూ వస్తున్నారు.ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్ర( Vrahi yatra ) కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నారు.దీనికి కౌంటర్ గా జనసేన గుర్తుపై వైసిపి నాయకులు విమర్శలు చేస్తుండగా, తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్( Glass symbol ) గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేసింది.
జనసేన ను రాష్ట్ర పార్టీగా గుర్తించి ఈ మేరకు స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అభ్యర్థులందరికీ ఈ గుర్తును కేటాయించబోతున్నారు.వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా వారికి గాజు గ్లాసు గుర్తే లభిస్తుంది.జాతీయస్థాయిలో రాష్ట్రస్థాయి పార్టీగా గుర్తింపు పొందే అంత ఓట్లు, సీట్లు రాకపోవడంతో జనసేనకు గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ క్యాటగిరిలో గతంలో కేంద్ర ఎన్నికల సంఘం చేర్చింది.నిబంధనల ప్రకారం ఆ విధంగా చేసినా , జనసేన కోరితే తమ పార్టీ అభ్యర్థులందరికీ అదే గుర్తును కేటాయించే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఎలాగు రాష్ట్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా దానిని ఆమోదించనుంది.దీంతో ఇప్పటి వరకు పార్టీ గుర్తు విషయంలో ఆందోళన చెందిన జనసేనకు ఊరట లభించినట్లయ్యింది.
వచ్చే ఎన్నికల్లో జనసేన కీలక కాబోతుండడంతో , జనసేన ఎన్నికల గుర్తును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఈ క్రమంలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కేఆర్బిహెచ్ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేయడంతో జనసేనకు ఈ విధంగా గుర్తు విషయంలో ఉన్న బెంగ పోయింది.