ఏపీలో ప్రభుత్వం అందజేస్తున్న సెంటు పట్టాలు బోగస్ అని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు.అమరావతిపై కక్షతోనే జగన్ సెంటు పట్టాల నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
కనీస వసతులు లేని సెంటు పట్టాలు ఏం చేసుకుంటారని బోండా ఉమ ప్రశ్నించారు.జగన్ సభకు జనాలను బలవంతంగా తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు.
కాగా ఇవాళ సీఎం జగన్ పేదలకు ఆర్ -5 జోన్ లో లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే.