ప్రతీ సందర్భానికి ఒక రోజు ఉన్నట్లే ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు కూడా ఒక రోజు ఉంది.అది ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజు.
ఈ ప్రేమికుల రోజు ప్రతీ ఒక్కరూ తాము ప్రేమించేవారికి తమ ప్రేమను మరింత గొప్పగా చెప్పాలనుకుంటారు.అందుకే ఈ సందర్భాన్ని ఒక మర్చిపోలేని రోజుగా మార్చాలని భావించిన జీ తెలుగు ఒక మధ్య తరగతి కుటుంబంలో ప్రేమ మరియు మమతానురాగాలు ఏవిధంగా ఉంటాయో చూపించండానికి ఈ వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 12 గంటలకు మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనుంది జీ తెలుగు.
గుంటూరు దగ్గరలోని ఓ పల్లెటూరులో కాకా హోటల్ నడుపుకునే కొండలరావు (గోపరాజు రమణ) కొడుకు రాఘవ (ఆనంద్ దేవరకొండ) బొంబాయి చట్నీ బాగా చేస్తాడు.అయితే, గుంటూరులో హోటల్ పెట్టి అక్కడి ప్రజలకు తన బొంబాయి చట్నీ రుచి చూపించి ఫేమస్ అయిపోవాలని రాఘవ కలలు కంటూ ఉంటాడు.
కానీ, గుంటూరులో హోటల్ పెట్టడం రాఘవ తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు.మరోవైపు వరసకు మావయ్య అయ్యే నాగేశ్వరరావు కూతురు సంధ్య (వర్ష బొల్లమ్మ)ను రాఘవ ప్రేమిస్తాడు.
కానీ సంధ్యకు వాళ్ల నాన్న వేరే సంబంధాలు చూస్తుంటాడు.ఇలాంటి పరిస్థితుల మధ్య రాఘవ హోటల్ పెట్టి ఎలా సక్సెస్ అయ్యాడు? సంధ్యను పెళ్లి చేసుకున్నాడా? ఈ క్రమంలో రాఘవ ప్రయాణం ఎలా సాగింది? అనే విషయాలు ఈ సినిమాలో చూడాలి.
సో మిస్ అవ్వకుండా ఈ వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14 న మధ్యాహ్నం 12 గంటలకు మిడిల్ క్లాస్ మెలోడీస్ ను చూడండి.జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ ఛానళ్లలో.
డోంట్ మిస్ ఇట్.
ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.
మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.
జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.
జీ తెలుగు గురించి
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.
ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.
అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.
సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.
అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.