కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleswaram Project ) దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టులో( Telangana High Court ) సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.ఈ మేరకు కౌంటర్ లో సీబీఐ( CBI ) కీలక వ్యాఖ్యలు చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది.ఈ నేపథ్యంలో హైకోర్టు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని సీబీఐ పేర్కొంది.
ప్రాజెక్టు దర్యాప్తునకు అవసరమైన వనరులు, సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని సీబీఐ వెల్లడించింది.అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్ స్పెక్టర్లు, నలుగురు ఎస్పీలతో పాటు సిబ్బంది కావాలని సీబీఐ కోరింది.దీనిపై సీబీఐ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఫిబ్రవరి 2వ తేదీన విచారణ చేస్తామని వెల్లడించింది.