ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత, ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) సన్నిహితుడు సిమ్రంజీత్ సింగ్ ( Simranjeet Singh )ఇంటిపై కాల్పులు జరిగిన వ్యవహారం కెనడాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టిన ప్రభుత్వం, పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.సిమ్రంజీత్ సింగ్‌కు చెందిన సర్రే ఇంటిలో ఫిబ్రవరి 1వ తేదీ తెల్లవారుజామున 1.20 గంటల సమయంలో కాల్పులు జరిగాయి.రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) సర్రే యూనిట్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.ఫిబ్రవరి 6న 140 స్ట్రీట్‌లోని 7700 బ్లాక్‌లోని నివాసంపై తమ క్రైమ్ యూనిట్ సెర్చ్ వారెంట్‌ను అమలు చేసినట్లు తెలిపారు.
ఈ సోదాల్లో మూడు తుపాకులు, పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.సర్రేకు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశామని.
వీరిద్దరూ 16 ఏళ్ల బాలురేనని తెలిపారు.అజాగ్రత్తగా తుపాకీని ఉపయోగించినందుకు అరెస్ట్ చేసినట్లు ఆర్‌సీఎంపీ కార్పోరల్ సర్బ్‌జిత్ కే సంఘా ఒక ప్రకటనలో తెలిపారు.
వీరిని విడుదల చేసినప్పటికీ.కాల్పుల వెనుక వున్న వారిని తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారులు సమాచారాన్ని సేకరిస్తూనే వున్నారని పోలీసులు వెల్లడించారు.
బెదిరింపులు, హింసాత్మక చర్యలను ఆర్‌సీఎంపీ తీవ్రంగా పరిగణిస్తుందని, బాధితులకు ఎల్లప్పుడూ సన్నిహితంగా వుంటామని తెలిపారు.
సీబీసీ న్యూస్ ఛానెల్ ప్రకారం.తుపాకీ కాల్పుల్లో ఒక కారు తీవ్రంగా దెబ్బతినగా.ఇంట్లో పలు బుల్లెట్ రంధ్రాలు వున్నాయి.
బ్రిటీష్ కొలంబియా గురుద్వారాస్ కౌన్సిల్ ప్రతినిధి మోనీందర్ సింగ్( Moninder Singh ) .సిమ్రంజీత్‌ను నిజ్జర్ సన్నిహితుడిగా పేర్కొన్నారు.నిజ్జర్‌తో వున్న సంబంధాలు ఈ కాల్పులకు కారణమై వుండొచ్చని సిక్కు కమ్యూనిటీ భావిస్తోందని మోనీందర్ సీబీసీకి తెలిపారు.జనవరి 26న వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ వద్ద ఖలిస్తాన్( Khalistan ) అనుకూల నిరసనను నిర్వహించడంలో సిమ్రంజీత్ సహాయం చేసిన కొద్దిరోజులకే కాల్పులు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
నిజ్జర్ హత్యతో ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే.నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం వుండొచ్చన్న కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో( Canadian Prime Minister Justin Trudeau ) వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఇరు దేశాలు ఇప్పటికే దౌత్యవేత్తలను బహిష్కరించాయి.అయితే కెనడాలో వుంటున్న సిక్కుయేతర మతస్తులు ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.