కెనడా ఎన్నికలు: సింహాసనం మళ్లీ ట్రూడోదే.. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా, కానీ..!!

కెన‌డా ప్ర‌ధాన మంత్రిగా జ‌స్టిన్ ట్రూడో ముచ్చటగా మూడోసారి ఎన్నిక‌య్యారు.ఎన్నిక‌ల ఫలితాల అనంతరం తామే గెలిచిన‌ట్లు ట్రూడో ప్రకటించారు.

 Canada Elections: Justin Trudeau Wins 3rd Term, Fails To Get Majority , Canada,-TeluguStop.com

త్వరలోనే తాము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.ఓటింగ్‌లో పాల్గొని తనకు మరోసారి అధికారాన్ని అందించిన దేశ ప్రజలకు ట్రూడో ధన్యవాదాలు తెలిపారు.

లిబ‌ర‌ల్ పార్టీ త‌ర‌పున ప్ర‌ధాని అభ్య‌ర్థిగా పోటీలో నిలిచిన ట్రూడోకు క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నుంచి గ‌ట్టి పోటీ ఎదురైంది.ప్రస్తుతం మిత్రపక్షాల మద్ధతుతో మైనార్టీ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న ట్రూడో.

గ‌త ఆగ‌స్టులో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు.రెండోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్ల‌కే ఆయ‌న ఎన్నిక‌ల‌కు పిలుపునిచ్చారు.

అయితే ఈసారి కూడా గెలిచినా.ట్రూడో మాత్రం భారీ మెజారిటీ సాధించాలన్న ఆశలు నెరవేరలేదు.

338 సీట్లున్న కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు 170 సీట్లు కావాలి.అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.

లిబ‌ర‌ల్ పార్టీ 157 సీట్ల‌లో విజ‌యం సాధించింది.ఇక క‌న్జ‌ర్వేటి పార్టీ 122 స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

దేశ‌వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 95 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యిందని ఎన్నికల సంఘం తెలిపింది.అయితే కెన‌డా చరిత్ర‌లోనే ఇవి అత్యంత ఖ‌రీదైన ఎన్నిక‌లుగా విశ్లేషకులు చెబుతున్నారు.2019లో గెలిచిన సీట్ల‌తో పోలిస్తే, ఈ సారి మూడు సీట్ల‌ను లిబ‌ర‌ల్ పార్టీ కోల్పోయింది.

Telugu Canada, Canadajustin, Erin, Fails Majority, Justin Trudeau, Liberal, Papi

ఇక ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో త‌న స్థానంలో విజయం సాధించారు.పాపినియో స్థానం నుంచి పోటీ చేసిన ఆయన సొంత జిల్లాకు వెళ్లి ఓటేశారు.పోల్ వ‌ర్క‌ర్ల‌ను మెచ్చుకుంటూ ప్ర‌ధాని త‌న ట్విట్ట‌ర్‌లో కొన్ని ఫోటోలు పోస్టు చేశారు.

అటు ప్ర‌త్య‌ర్థి క‌న్జ‌ర్వేటివ్ నేత ఎరిన్ కూడా త‌న పార్ల‌మెంట్ స్థానంలో విజ‌యం సాధించారు.ఓంటారియోలోని దుర్హ‌మ్ నుంచి ఆయ‌న పోటీ చేసి గెలిచారు.ఎన్నిక‌ల‌కు ముందు ప‌ది డాల‌ర్ల‌కే చైల్డ్ కేర్, చౌకైన ఇళ్లు, ఆయుధాల‌పై నిషేధం, గ్రీన్ జాబ్స్‌, న‌ర్సులు, డాక్ట‌ర్లు, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ కావాలంటే లిబ‌ర‌ల్ పార్టీకి ఓటు వేయాల‌ని ట్రూడో దేశ ప్రజలను కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube