టాలీవుడ్ మెగా హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు.అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు అర్జున్ తమ్ముడిగా అల్లు శిరీష్ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.
కానీ అల్లు శిరీష్ తన బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకుని పైకి రావాలి అనుకోలేదు.తన నటనతో ప్రేక్షకులను మెప్పించి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు.
కానీ అల్లు శిరీష్ చేసిన సినిమాలు ఇప్పటి వరకు సూపర్ హిట్ అవ్వలేదు.
కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయి.
అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.ముందుకన్నా కూడా ఇప్పుడు అల్లు శిరీష్ తన నటనతో మెప్పిస్తున్నాడు.
ఇక ఇప్పుడు చాలా రోజుల గ్యాప్ తర్వాత ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను రాకేష్ శశి డైరెక్ట్ చేసారు.
ఇక ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.
ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునేలా అన్ని హంగులతో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఎప్పటి నుండో ప్రొమోషన్స్ జరుగుతున్నా తమ్ముడు సినిమాను అల్లు అర్జున్ సపోర్ట్ చేయక పోవడం చర్చకు దారి తీస్తుంది.

ఈ సినిమా గురించి ఒక్క ట్వీట్ చేయడం కానీ ఎక్కడైనా స్పందించడం కానీ చేయలేదు.విడుదల రోజు వచ్చిన కానీ ఐకాన్ స్టార్ నుండి మద్దతు రాకపోవడం అందరిని ఆశ్చర్య పోయేలా చేస్తుంది.ఇతడికి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి మద్దతు తెలిపి ఉంటే ఓపెనింగ్స్ బాగా వచ్చేవి.ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా అల్లు అర్జున్ రాలేదు.
బాలయ్య మాత్రం వచ్చి ఈ సినిమా ప్రొమోషన్స్ కు సహాయం చేసాడు.అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా ఈయనకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
కానీ సొంత అన్నయ్యే చెప్పక పోవడం కొద్దిగా ఆశ్చర్యమే.