టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఫోర్జరీ కేసుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.అయ్యన్నపాత్రుడు రిమాండ్ ను తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై సీఐడీ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై అత్యవసరంగా విచారించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.కాగా ఈ పిటిషన్ పై న్యాయస్థానం మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది.
ఫోర్జరీ కేసులో సీఐడీ పోలీసులు అయ్యన్నను అరెస్ట్ చేయగా విశాఖ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించడంతో ఆయన విడుదలైన సంగతి తెలిసిందే.







