ప్రస్తుతం వర్షాకాలం పోయి చలికాలం ప్రారంభమైంది.కొద్ది కొద్దిగా చలి పెరుగుతూ అందరినీ వణికిస్తోంది.
ఇక వెచ్చదనం కోసం మూగజీవులు ఇబ్బంది పడుతున్నాయి.విషపూరితమైన పాములు అయితే ఏకంగా ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో అవి ప్రాణాపాయం సృష్టిస్తున్నాయి.ఇళ్లల్లోకి వచ్చి షూలలో దూరుతున్నాయి.
ఫలితంగా చిన్న వారైనా, పెద్ద వారైనా ఆదమరిచి ఆ బూట్లను తొడుక్కున్నప్పుడు పాములు కాటేస్తున్నాయి.అందుకే ఈ సమయంలో ధరించే ముందు బూట్లను సరి చూసుకుని వేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
తాజాగా పాములు చాలా చోట్ల వాహనాలలో దూరుతున్నాయి.ఏ మాత్రం చూసుకోకుండా వాహనాలను నడిపితే ప్రయాణం మధ్యలో అవి కనపడుతున్నాయి.
అలాంటి సందర్భాలలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది.తాజాగా ఇలాంటి ఘటన జరిగింది.
దానికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాలలో పాములు దూరుతున్నాయి.తాజాగా అవినాష్ యాదవ్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేశాడు.అందులో ఓ పాము హోండా యాక్టివా ముందు భాగంలో చేరిపోయింది.
అందులో ఎలా దూరిందో ఎవరికీ అర్ధం కాలేదు.ఆ వాహన యజమాని ఆ పామును చూసి ఆందోళన చెందాడు.
ఈ విషయాన్ని స్థానికులకు చెప్పగా వారంతా పెద్ద ఎత్తున గుమిగూడారు.చివరికి ఓ స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు.
ఆ స్నేక్ క్యాచర్ వచ్చి ఆ నాగుపామును పట్టుకునేందుకు యత్నంచాడు.అయితే ఆ నాగుపాము బుసలు కొట్టింది.
దగ్గరకు వస్తే కాటేసేందుకు యత్నించింది.చివరికి స్క్రూ డైవర్ సాయంతో స్కూటీ ముందు భాగాన్ని ఆ స్నేక్ క్యాచర్ విడదీశాడు.
అందులో నుంచి బుసలు కొడుతున్న పామును చాకచక్యంగా, తనను కాటేయకుండా లొంగదీసుకున్నాడు.దీంతో అప్పటి వరకు ఎంతో ఉత్కంఠగా చూసిన ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.







