సిస్టర్‌ని పెళ్లికూతురుగా చూసి ఎమోషనల్ అయిన బ్రదర్.. హార్ట్‌టచింగ్‌ వీడియో వైరల్..!

పెళ్లి దుస్తుల్లో తోబుట్టువులను చూడాలనే కోరిక చాలామందిలో బలంగా ఉంటుంది.నిజానికి సోదరి లేదా సోదరుడి పెళ్లిరోజు వారి జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా నిలుస్తుంది.

 Brother Who Is Emotional Seeing Sister As Bride Sister, Bride, Groom, Emotional-TeluguStop.com

తోడబుట్టిన వారు ఒక ఇంటి వారు అవుతున్నారనే ఆనందం మాటల్లో వర్ణించలేనిది.వెడ్డింగ్ డే రోజున వారి ఆనందం చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

అయితే తాజాగా ఇలాంటి ఓ బ్యూటిఫుల్ మూమెంట్ ని చూపించే ఒక వీడియో వైరల్ గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో గన్‌వీత్ సింగ్ అనే ఓ బ్రదర్ తన సిస్టర్ తాన్య కౌర్‌ పెళ్లి రోజున ఎమోషనల్ అయ్యాడు.

ఈ వీడియో ప్రకారం, తాన్య కళ్లు చెదిరే వెడ్డింగ్ డ్రెస్ ధరించి ఒక గదిలో కూర్చుంది.ఈ వధువు చాలా చూడముచ్చటగా ఉంది.

ఇంతలోనే ఆమె సోదరుడు ఆ గదిలోకి విచ్చేశాడు.తర్వాత తన సిస్టర్ ని పెళ్లికూతురు అవతారంలో చూసి ఫిదా అయిపోయాడు.

తన సోదరి మరికొద్ది గంటల్లో పెళ్లి చేసుకోబోతోందని, తనని విడిచి భర్తతో వెళ్ళిపోతుందని బాగా ఎమోషనల్ అయ్యాడు.అలాగే పెళ్లి డ్రెస్సులో ఏంజెల్ లాగా కనిపించిన తన సోదరిని చూసి పరవశించి పోయాడు.

అనంతరం కుందనపు బొమ్మలా ఉన్నావంటూ తన సోదరిని బాగా పొగిడాడు.

ఈ దృశ్యాలను ఒకరు వీడియో రికార్డ్ చేశారు.ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ లో బ్రదర్ షేర్ చేశాడు.“నేను దీన్ని టైప్ చేస్తున్నప్పుడు ఏడుస్తున్నాను కానీ నా సోదరి చాలా అందంగా ఉంది” అనే క్యాప్షన్‌తో గన్‌వీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేయగా.అది వైరల్ గా మారింది.తోబుట్టువుల బంధం ఎంత అందమైనదో.వారి మధ్య ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో ఈ వీడియో చెప్పకనే చెబుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.దీనికి ఇప్పటివరకు 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.“మొత్తం కుటుంబానికి హార్ట్ ఫుల్ కంగ్రాట్యులేషన్స్.నిజానికి తాన్య చాలా అందంగా కనిపిస్తోంది.” అని ఒక ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ పేర్కొన్నాడు.మరికొందరు ఇది చాలా హార్ట్ టచింగ్ గా ఉంది అని కామెంట్ చేస్తున్నారు.మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube