అక్కడ మూత్రం పోసినందుకు రూ.100 + జిఎస్టి రూ.12 బిల్లు కట్టాల్సి వచ్చింది పాపం!

సోషల్ మీడియా పరిధి పెరుగుతున్న వేళ, అనునిత్యం ప్రపంచం నలుమూలలా జరుగుతున్న అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇందులో కొన్ని విడ్డూరంగ వుంటే, మరికొన్ని ఆశ్చర్యంగా వుంటాయి.

 British Tourists Charged Rs 112 Including Gst By Irctc For Using Toilet,gst,irct-TeluguStop.com

ఇంకొన్ని ఫన్నీగా వుంటే, వేరే విషయాలు ఒకింత బాధాకరంగా వుంటాయి.ఐతే ఇక్కడ జరిగిన విషయం అయితే కాస్త విడ్డూరమే అని చెప్పుకోవాలి.

మీరు బయట యెపుడైనా మూత్రం పోశారా? అదేనండీ.బయట టోయిలెట్స్ యెపుడైనా మూత్రం పోయడానికి మీరు వినియోగించే వుంటారు కదా.

దానికి మీ దగ్గర యెంత వసూలు చేసి వుంటారు? ఓ 5 రూపాయిలు… మహాకాకపోతే ఓ 10 రూపాయిలు… అంతే కదా.అయితే ఇక్కడ మనోడికి యేకంగా జి‌ఎస్‌టితో కలిపి 112 రూపాయిలు బిల్ వేశారు.దాంతో అతగాడు సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన ఓ విచిత్ర అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు.వివరాల్లోకి వెళితే, బ్రిటన్ నుండి ఇద్దరు యాత్రికులు భారత దేశాన్ని చూద్దామని వచ్చారు.

నాలుగు రోజుల క్రితం ఢిల్లీ నుండి గతిమాన్ ఎక్స్‌ప్రెస్ లో ఆగ్రా రైల్వే స్టేషన్ లో దిగారు.వాళ్ళిద్దరు తమని రిసీవ్ చేసుకున్న గైడ్ ను వాష్ రూం కు వెళ్ళాలని అడగగా ఆయన వాళ్ళను స్టేషన్‌లో ఉన్న ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లోకి తీసుకెళ్లాడు.

ఐదు నిమిషాల తర్వాత పని పూర్తి చేసుకొని వాళ్ళిద్దరూ బయటకు రాగానే రిసెప్షన్‌లో కూర్చున్న అమ్మాయి వాళ్ళ చేతిలో 240 రూపాయల బిల్లు పెట్టింది.అందులో ఒక్కొక్కరికి 100 రూపాయలు బిల్లు, 12 రూపాయలు జీఎస్టీ అని ఉంది.వాష్‌రూమ్‌ను వాడుకున్నందుకు రూ.112 బిల్లు రావడంపై గైడ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.కానీ, అక్కడ ఎవరూ అతని మాట వినలేదు.తప్పనిసరి పరిస్థితిలో, అతను రూ.224 చెల్లించాల్సి వచ్చింది.కాగా ఈ ఘోరాన్ని అతగాడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

దాంతో ఆ బిల్ కాస్త వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube