సోషల్ మీడియాలో ప్రతిరోజూ వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి.ఇప్పుడు అలాంటి వైరల్ వీడియో ఒకటి పెద్ద చర్చనీయాంశమైంది.
టీచర్, విద్యార్థి ( teacher student )మధ్య ఆన్‌లైన్ క్లాస్ వీడియో వైరల్ అవుతోంది.విద్యార్థి వీడియో కాన్ఫరెన్స్‌లో ఉపాధ్యాయుడికి ప్రపోజ్ చేయడం ఈ వైరల్ వీడియోలో చూడవచ్చు.
ఇకపోతే ఇదివరకు ఆన్‌లైన్ తరగతుల్లో విద్యార్థులు దురుసుగా ప్రవర్తించిన పలు వీడియోలు, కొన్నిసార్లు ఒక విద్యార్థి ఉపాధ్యాయుని మేకప్‌ను మెచ్చుకోవడం, కొన్నిసార్లు ఒక విద్యార్థి ఆన్‌లైన్ తరగతుల సమయంలో నిద్రపోతున్నట్లు కూడా కనిపించడం లాంటి వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇకపోతే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో @tv1indialive ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయబడింది.
వీడియోలో, ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థిని తన ప్రశ్నను కొనసాగించమని చెబుతుంది.విద్యార్థి మొదట మీకు పెళ్లి అయ్యిందా అని అడగా.
టీచర్ ప్రశాంతంగా ‘లేదు’ అని సమాధానం చెప్పింది.విద్యార్థి అప్పుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మేడమ్ అని అన్నాడు.
అయితే దానికి టీచర్ సమాధానమిస్తూ.ప్రియమైన స్టూడెంట్, నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను.
విద్యార్థి తన టీచర్‌ని మళ్లీ విద్యార్థి.నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా.? అన్ని అడిగాడు.దానికి టీచర్ బదులివ్వకుండా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయారు.
ఇంకేముంది ఆ సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇప్పటివరకు లక్షల సంఖ్యలో వీక్షించారు.
ఇక ఈ వీడియోకి సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ప్రస్తుతం విద్యార్థులు వారి ఉపాధ్యాయులతో ఎలాంటి భయం , భక్తి లేకుండా వ్యవహరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తుండగా.మరి కొందరేమో పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలపై కాన్సన్ట్రేషన్ చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు.