టర్కీలో( Türkiye ) భారత కొత్త రాయబారిగా , సీనియర్ దౌత్యవేత్త ముక్తేష్ కుమార్ పర్దేశిని( Muktesh Kumar Pardeshi ) కేంద్ర ప్రభుత్వం నియమించింది.1991 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన పర్దశి ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు.గతేడాది సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మక జీ20 సమ్మిట్‌ను( G20 Summit ) భారత్ విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన అధికారుల బృందలో ముక్తేష్ ఒకరు.ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా మారిన ఉక్రెయిన్ వివాదంపై ఆయనకు లోతైన అవగాహన ఉంది.
సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరేందర్ పాల్ మరణించడంతో టర్కీలో భారత రాయబారి( Indian Ambassador ) పదవి గత జూన్ నుంచి ఖాళీగా ఉంది.విదేశాంగ శాఖలో సెక్రటరీగా మధ్యప్రాచ్యంలో నివసిస్తున్న భారతీయులకు సహాయం చేయడానికి , ప్రజల మధ్య సంబంధాలను పెంచడానికి పర్దేశి కీలక చర్యలు తీసుకున్నారు.జూలై 2019 నుంచి జూలై 2022 వరకు ఆయన న్యూజిలాండ్‌లో భారత హైకమీషనర్‌గా పనిచేశారు.సమోవా, వనాటు, నియు, కుక్ దీవులకు కూడా హైకమీషనర్‌గా సేవలందించారు.ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న పర్దేశి.హిందూ కాలేజీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ, మాస్టర్స్ చేశారు.
ఫారిన్ సర్వీస్ అధికారిగా ఆయన పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.
పర్దేశి ఏప్రిల్ 2016 నుంచి జూన్ 2019 వరకు మెక్సికోలో భారత రాయబారిగా పనిచేశారు.తన పదవీకాలంలో ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అయ్యింది.మూడేళ్ల కాలంలో దాదాపు 75 శాతం వృద్ధిని నమోదు చేయడంతో భారత్ – మెక్సికో ప్రివిలేజ్డ్ పార్టనర్‌షిప్ భారీ పురోగతిని సాధించింది.
ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో 2010-16 మధ్య పర్దేశి .సంయుక్త కార్యదర్శి, చీఫ్ పాస్‌పోర్ట్ అధికారిగా సేవలందించారు.ఆ సమయంలో దేశంలో పాస్‌పోర్ట్ జారీ ఆరు మిలియన్ల నుంచి 12 మిలియన్లకు చేరడం వెనుక ఆయన కీలకపాత్ర పోషించారు.విదేశాంగ శాఖలో సమర్ధుడైన అధికారిగా పర్దేశికి పేరుంది.