ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డు పై చర్చ జరుగుతోంది.గత ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డు(Tirumala Laddu) సంబంధించిన అనేక విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తెలిపారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అనేక విషయాలు ఒక్కోటి బయటపడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (CM Pawan Kalyan)కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హిందూ ధర్మాన్ని పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని చర్యలు చేపట్టాల్సిందిగా ఆయన కోరారు.
అయితే., ఈ విషయంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj)సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.తిరుపతి లడ్డు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిందని.కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విషయం చూడాలని.దాన్ని జాతీయ వ్యాప్తంగా ఎందుకు చేస్తారు అంటూ వ్యాఖ్యానించాడు.అయితే ఈ విషయంపై మా అసోసియేషన్ ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు(manchu Vishnu) కూడా దానికి సమాధానంగా కాస్త ఘాటుగానే స్పందించాడు.
ఇందులో ప్రకాష్ రాజు గారు మీరు కాస్త దయచేసి నిరుత్సాహపడి అసహనం చేయాల్సిన పనిలేదని.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో లడ్డు వ్యవహారంపై సమగ్ర విచారణ చేపడుతున్నారని.
ఈ విషయం సంబంధించి మీ పరిధిలో మీరు ఉంటే మంచిదని కాస్త ఘాటుగానే హెచ్చరించాడు.
అయితే ఈ విషయంపై తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ ట్విట్టర్(tweeter) వేదికగా మంచు విష్ణుకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.ఇందులో భాగంగా ” ఓకే శివయ్య.నా దృష్ట కోణం నాకు ఉంది.
అలాగే మీకు కూడా ఉంటుంది.అది గుర్తుపెట్టుకోండి అంటూ.
జస్ట్ అడుగుతున్నా (Justasking) అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.అలాగే నవ్వుతున్న ఏమోజి కూడా జత చేశారు.
ప్రస్తుతం లడ్డూ వివాదం ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య ట్విట్టర్ వార్ వైపు దారితీస్తోంది.