ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంలో బ్రిటన్ ఉంది.యురోపియన్ యూనియన్ లో బ్రిటిష్ దేశాలు ఒకప్పుడు ప్రపంచాన్ని ఎలాయి.
ఆసియాతో ఉన్న చాలా దేశాల మీద యురోపియన్ దేశాలు పెత్తనం చేసి, ఆకక్ది సహజ సంపదని తమ దేశాలకి తీసుకుపోయాయి.అలాగే విజ్ఞానాన్ని కూడా తమ దేశాలకి యూరోపియన్ దేశాల వారు తరలించుకుపోయారనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది.
యూరోపియన్ యూనియన్ లో బలమైన దేశంగా బ్రిటన్ ఉంది.అన్ని దేశాలకి బ్రిటన్ పెద్దన్నలా వ్యవహరించేది.
అయితే ఇదే ఆ దేశానికి భారంగా మారిందని.ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వేరుకుంపటి పెట్టడానికి రెడీ అయ్యింది.
తాజాగా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.ఎన్నో ఏళ్లుగా నెలకొన్న సందిగ్ధానికి స్వస్తి పలికి బ్రిటన్ పార్లమెంట్ లో ఓటింగ్ ద్వారా బ్రిగ్జెట్ నిర్వహించి యూరోపియన్ యూనియన్ నుంచి బయటకి రావడానికి మద్దతు సంపాదించింది.
ఈనెల 31న యూరోపియన్ యూనియన్ నుంచి అధికారికంగా వైదొలగడానికి బ్రిటన్ తీర్మానం చేసింది.ఐరోపా సమాఖ్య నుంచి విడిపోతున్న మొదటి దేశం బ్రిటన్ కావడం గమనార్హం.ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగడం వలన బ్రిటన్ నష్టపోతుందని మిగతా దేశాలు అంటూ ఉండగా తమ డబ్బు సామర్థ్యం తమకే దక్కి లాభపడుతామని బ్రిటన్ వాసులు అంటున్నారు.గత వైభవం తమకి తిరిగి వస్తుందని బ్రిటన్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
మొత్తానికి ప్రపంచ దేశాలని శాసించిన యూరోపియన్ దేశాలు ఇప్పుడు విడిపోవడం ద్వారా ఎలాంటి సందిగ్ధం పరిస్థితిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.