నెగ్గిన ట్రంప్ పంతం..

ఎట్టకేలకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు.అమెరికాలో మహిళలు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కావెనా ని వ్యతిరేకిస్తున్నా సరే అతడిని ట్రంప్ నియమించడం పై సర్వాత్రా విమర్శలు ఎదురవుతున్నాయి…ఎంతో మంది మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసనలు, ఆందోళనలు తెలిపినా సరే ట్రంప్ వెనక్కి తగ్గలేదు.

 Brett Kavanaugh Sworn In As Supreme Court Judge-TeluguStop.com

లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రెట్ కావెనా(53) అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా ఆదివారం ప్రమాణం చేశారు.

కీలకమైన మధ్యకాల ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జరిగిన ఈ పరిణామం ట్రంప్‌కు చెప్పుకోదగ్గ విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు.కావెనా జడ్జిగా ప్రమాణం చేయడంపై క్యాపిటల్ హిల్‌లో పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు.సుప్రీంకోర్టు 114వ న్యాయమూర్తిగా బ్రెట్ కావెనాతో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ న్యాయమూర్తుల కాన్ఫరెన్స్‌రూంలో ప్రమాణం చేయించారు.

అయితే ఈ పరిణామాలకి ముందు కావెనా అభ్యర్ధిత్వాన్ని ఆమోదించడంలో సెనేట్ రెండుగా చీలిపోయింది.ఎట్టకేలకు 50-48 స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థిత్వం ఖరారైంది.ఒక న్యాయమూర్తి ఎంపికలో 1881 తర్వాత ఇంత తక్కువ మెజార్టీ నమోదు కావడం ఇదే మొదటిసారి… కావెనా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జీవితకాలంపాటు కొనసాగుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube