గుంటూరు జిల్లా జిజిహెచ్ లో ఓ బాలుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతుంది.మాచాయపాలేనికి చెందిన ఓ గర్భిణి ఆస్పత్రిలో చేరింది.
ఆమె బంధువులు దగ్గర ఉన్న బాలుడు ఉదయం లేచి చూసేసరికి కనిపించకుండా పోయాడు.దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
బాలుడు అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు జిజిహెచ్ లో సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.అయితే సీసీ టీవీలో వేరే మహిళ బాబుని తీసుకెళ్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.