సంక్రాతి సీజన్ స్టార్ట్ అయిందంటే ఎక్కడో సుదూరాల ఉండేవారు కూడా తమ సొంత ఇళ్లకు బయలుదేరుతారు.జిల్లా, రాష్ట్రము అనేకాదు… విదేశాలలో ఉండేవారు సైతం నేటివ్ ప్లేస్ కి పయనం అవుతారు.
ఇక దీనిని క్యాష్ చేసుకోవాలనే నెపంతో వివిధ ప్రయాణ సంస్థలు దారుణంగా రేట్లను పెంచేస్తాయి.అలాంటిది విమాన సంస్థలు మరి వూరుకుంటాయా? డిమాండ్ ని బట్టే ఇక్కడ రేట్లు పెంచేస్తారు.ఇకపోతే ఈసారి దీపావళి పండుగ నేపథ్యంలో విమాన ఛార్జీలు ఎన్నడూ లేని విధంగా ఆకాశాన్నంటుతున్నాయి.
మరో 4 రోజుల్లో దీపావళి వస్తుంది కనుక, ఈ నేపథ్యంలో దేశీయ విమాన టికెట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.
బేసిగ్గా ఫెస్టివల్ సీజన్‌లో మంచి డిమాండ్ ఉంటుంది కనుక డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి.కొన్ని మెట్రో మార్గాల్లో విమాన టికెట్లు దాదాపు రెండు రెట్లు అధికం అయినట్టు భోగట్టా.
ఈ ఛార్జీలు డబుల్ అయినా ప్రయాణికులు ఏమాత్రం తగ్గడం లేదు.ఈ ధరలను ఒకసారి చూస్తే గనుక ముంబై, ఢిల్లీ మధ్య ఒక నాన్‌స్టాప్ రౌండ్ ట్రిప్ టికెట్ ధర బేసిగ్గా రూ.12,000 ఉంటుంది.ఈ ధర ప్రస్తుతం రూ.23,000కి చేరుకుంది అంటే ఆలోచించండి.

ఇకపోతే పండుగ రద్దీ కారణంగా ఢిల్లీ, ముంబై మధ్య నడిచే విమానాల ఛార్జీలు 20-25% పెరిగాయని తాజాగా ట్రావెల్ పోర్టల్ అధికారులు వెల్లడించారు.ముఖ్యంగా ముంబై-ఢిల్లీ, ఢిల్లీ-పాట్నా, ముంబై-పాట్నా మధ్య విమానాలు ఈ బుధవారం అత్యంత భారీ ధరలను కలిగి వున్నాయి.ఇకపోతే అక్టోబరు 30న జరుపుకోనున్న ఛత్ పూజ కారణంగానే పాట్నాకు ఈ రద్దీ ఏర్పడిందని ఎయిర్‌లైన్ అధికారులు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.అక్టోబర్ 21, 31 మధ్య ఢిల్లీ నుంచి పాట్నాకి ఒక రౌండ్ ట్రిప్ టికెట్ ఒక్క గురువారం నాడు రూ.25,000కి చేరుకుందంటే ఆలోచించండి.







