టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ మీడియాకు ఇంటర్య్వూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తారక్ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయంలో డ్యాన్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఎలాంటి ఎమోషన్ ను అయినా డ్యాన్స్ ద్వారా చెప్పడం సాధ్యమవుతుందని తారక్ కామెంట్లు చేశారు.
భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ప్రత్యేకమైన డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయని తారక్ చెప్పుకొచ్చారు.
డ్యాన్స్ తో డ్రామాను చూపించగలమని డ్యాన్స్ తోనే భావాన్ని వ్యక్తీకరించలగమని తారక్ కామెంట్లు చేశారు.భారతీయులు ఏ ఎమోషన్ ను అయినా డ్యాన్స్ ద్వారా చెప్పగలరని తారక్ చెప్పిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు తారక్ కొత్త లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
స్లిమ్ లుక్ లో తారక్ మరింత అందంగా కనిపిస్తున్నారు.
తారక్ త్వరలో కొరటాల శివ సినిమా షూటింగ్ లో పాల్గొంటుండగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయి.అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.అనిరుధ్ ఈ సినిమా మ్యూజిక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ సినిమాలో మొదట అలియా భట్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.అయితే కొన్ని కారణాల వల్ల అలియా భట్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ ను ఎంపిక చేయడం దర్శకనిర్మాతలకు సమస్యగా మారింది.అలియా భట్ రేంజ్ ఉన్న హీరోయిన్ ను ఎంపిక చేయడం దర్శకనిర్మాతలకు సమస్యగా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.







