బాలీవుడ్ నటి భాగ్యశ్రీ( Actress Bhagyashree ) గురించి మనందరికీ తెలిసిందే.మైనే ప్యార్ కియా సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
ఈ సినిమా తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకుంది.
తెలుగులో ఓంకారం, యువరత్న రాణా, రాధేశ్యామ్ చిత్రాల్లో నటించి మెప్పించింది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్లో ఎదురైన చేదు సంఘటనలను పంచుకుంది.

మైనే ప్యార్ కియా సినిమా( Maine Pyar Kiya ) తనకు సక్సెస్‌తోపాటు కొన్ని ఇబ్బందులు కూడా తీసుకువచ్చిందని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది.ఈ చిత్రం విడుదలైనప్పుడు సల్మాన్ ఖాన్( Salman Khan ) తో రిలేషన్లో ఉందని బాలీవుడ్ లో మాట్లాడుకున్నారని, పలు పత్రికల్లోనూ వీరిద్దరి గురించి పెద్దఎత్తున వార్తలు వినిపించాయి.తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి స్పందిస్తూ.నా కుమారుడు అభిమన్యు పుట్టిన తర్వాత రోజు నన్ను కలవడానికి ఒక మహిళా రిపోర్టర్ వచ్చారు.
విషెస్ చెప్పిన ఆమె అక్కడే ఉన్న నా భర్తను ఒక ప్రశ్న అడిగింది.

సల్మాన్ ఖాన్‌తో మీ భార్య రిలేషన్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై ఈ సమాధానం ఏంటి అని ప్రశ్నించగా.ఆ క్షణం నేను షాక్ అయ్యాను.
నా జీవితంలో అలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురు కాలేదు.అప్పటి నుంచి నేను ఫిల్మ్ మ్యాగజైన్స్ చదవడం మానేశాను.
సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ.సల్మాన్ ఎంతో మంచి వ్యక్తి, అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు భాగ్య శ్రీ.
కాగా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్( Radhe Shyam ) సినిమా గత ఏడాది విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లి క్యారెక్టర్ లో నటించింది భాగ్యశ్రీ.