బాపట్ల జిల్లాలోని నిజాంపట్నంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని సీఎం జగన్ తెలిపారు.చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోటని తెలిపారు.14 ఏళ్లుగా సీఎంగా చేసినా చంద్రబాబు ఒక్క మంచిపనీ గుర్తుకు రాదని విమర్శించారు.చంద్రబాబు, పవన్ లు పొత్తులు, ఎత్తులు, కుయుక్తులను నమ్ముకున్నారన్నారు.
పవన్ కల్యాణ్ పార్టీ 10 ఏళ్లు అయ్యింది కానీ ఈ సమయంలో 175 మంది అభ్యర్థులను కూడా పెట్టలేకపోయారని ఎద్దేవా చేశారు.రెండు సినిమాల షూటింగ్ ల మధ్యలో పొలిటికల్ మీటింగ్ లకు పవన్ వస్తుంటారని తెలిపారు.
బాబు స్క్రిప్ట్ ప్రకారమే పవన్ వచ్చి మాట్లాడుతుంటారని విమర్శలు చేశారు.