చాలా రోజులకు ఎదురుచూస్తున్న బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా నేడు విడుదల కానుంది. మొదటి విడతల 55 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.
టిఆర్ఎస్ సం పార్టీ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ సైతం 55 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది .ఈరోజు బిజెపి తొలి జాబితా కూడా విడుదల కాబోతోంది.చాలా రోజులుగా దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది.తొలి విడత 55 మంది అభ్యర్థులతో కూడిన జాబితాకు కేంద్ర ఎన్నికల ప్రచార కమిటీ ఆమోదం తెలిపింది.ప్రధాని నరేంద్ర మోది అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ నిన్న రాత్రి సమావేశం అయింది .ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ( Amith sha ) పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో పాటు, కమిటీ సభ్యులైన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి , ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ ఇన్చార్జీలు తరుణ్ చుగ్ , సునీల్ బన్సాల్ , ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాబితాలోని 55 మంది అభ్యర్థులకు ఆమోదం తెలిపారు.ఈ జాబితాను ఈరోజు అధికారికంగా బిజెపి ప్రకటించనుంది.పార్టీ కీలక నేత , హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ తో పాటు, కేసీఆర్( KCR ) పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి పోటీకి దింపాలని నిర్ణయించారట.ఇక తెలంగాణలో బిజెపికి నలుగురు ఎంపీలు ఉండగా, ముగ్గురిని శాసనసభ ఎన్నికల్లో పోటీకి దింపాలని బిజెపి జాతీయ నాయకత్వం నిర్ణయించిందట.
కరీంనగర్ ఎంపీ , బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్( Bandi Sanjay ) నూ కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ను బోథ్ నియోజకవర్గం నుంచి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు.అలాగే మాజీ ఎంపీ వివేక్ ను చెన్నూరు నుంచి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గద్వాల నుంచి పోటీకి దింపుతున్నారట .అలాగే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ను మరోసారి అదే నియోజకవర్గంలో నుంచి పోటీ కి దించుతున్నారట.ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత పైన ఈ సమావేశంలో చర్చించారట.