AP BJP: ఏపీ రాజకీయాలపై బీజేపీ సీరియస్?

ఏపీ రాజకీయాల విషయంలో చూడబోతే బీజేపీ చాలా సీరియస్ గానే ఉంది అంటున్నారు.ఏపీలో ఏముంది అని వదిలేయడంలేదు.

 Bjp Party Serious About Ap Political Game Details, Bjp Party , Ap Political Game-TeluguStop.com

ఏపీ నుంచే బీజేపీ అధికార సూర్యదయాన్ని కమలం పార్టీ చూస్తోంది అని చెబుతున్నారు.అదెలా అంటే ఏపీలో రెండు బలమైన పార్టీలను దశల వారీగా నిర్వీర్యం చేయడం తమకు మిత్రుడిగా ఉన్న మూడవ ప్రాంతీయ పార్టీని బలోపేతం చేయడం తాము అన్నింటికన్నా బలంగా మారడం.

అయిదేళ్ళు గిర్రున తిరిగేసరికి కుర్చీని పట్టేసి ఏపీని సుదీర్ఘకాలం ఏలడం.ఇదీ బీజేపీ పక్కా మాస్టర్ ప్లాన్.

అందులో భాగంగానే మొదటి దెబ్బ తెలుగుదేశానికి పడుతుంది అని అంటున్నారు.అందుకే జనసేనను తమ వైపునకు తిప్పుకుంటోంది.

ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి జనసేన సాయం చేయరాదు.మరోసారి ఆ పార్టీ అధికారానికి ఊపిరులు ఊదరాదు.

ఇక గేమ్ ప్లాన్ లో జనసేనను బీజేపీ శక్తి కొలదీ బలోపేతం చేస్తుంది.తాను కూడా పటిష్టంగా తయారవుతుంది.

ఏపీలో టీడీపీని వెనక్కి నెట్టేసి జనసేనను ముందుకు తేవాలి.ఆ విధంగా జనసేన ఎంతలా దూకుడు ప్రదర్శిస్తే అంతలా వైసీపీకి ఆ పార్టీ టార్గెట్ అవుతుంది.

అపుడు జనసేనకు వైసీపీ తొలి ప్రయారిటీ ఇచ్చి విమర్శల దాడిని పెంచుతుంది.ఆటోమేటిక్ గా టీడీపీ ప్లేస్ తగ్గిపోతుంది జనసేన బీజేపీ ఆ ప్లేస్ లోకి వస్తాయి.

ఈ విధంగా వ్యూహం బీజేపీ రూపకల్పన చేసింది అని అంటున్నారు.ఈ త్రిముఖ వ్యూహాన్నికి నరేంద్ర మోడీ విశాఖ టూర్ లో తన దగ్గరకు పిలిపించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి చెప్పారని అంటున్నారు.

నిజానికి బీజేపీ అంతిమ లక్ష్హ్యం వేరుగా ఉంటుంది.ఏపీలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా ప్రాంతీయ పార్టీలు లేకుండా సోలోగా బీజేపీ ఏలాలనే.దానికి ముందుగా ఒక్కో ప్రాంతీయ పార్టీని ఎలిమినేట్ చేయాలని చూస్తోంది.ఆ విధంగా చూస్తే ఏపీలో ఇపుడు తెలుగుదేశం పార్టీ బీజేపీకి బాగా చిక్కింది.

నిజానికి నరేంద్ర మోడీ అమిత్ షాలకు చంద్రబాబు మీద కోపం ఆయన అన్నేసి రకాలుగా అనుచితమైన మాటలు తమను అన్నారని ద్వేషం అందుకే టీడీపీతో జట్టుకట్టడంలేదని చాలా మంది అంటున్నారు.కానీ అది వాస్తవం కాదు రాజకీయాల్లో శతృవులు మిత్రులు శాశ్వతంగా ఉండరు.

ఆ విధంగా చూస్తే ఇవన్నీ ఢక్కామెక్కీలు తిన్న బీజేపీకి తెలియదా.కానీ ఆ పార్టీ ఏపీలో తన రాజకీయ అవకాశాలను పెంచుకోవాలని చూస్తోంది.2014 నుంచే ఆ ప్రయత్నాలలో ఉంది.దాని ఫలితమే టీడీపీతో తప్పనిసరి పరిస్థితులలో దోస్తీ చేసినా 2019 నాటికి వైసీపీకి ఊతమిచ్చి ఆ పార్టీని సైడ్ చేసి పారేసింది.

Telugu Amith Shah, Ap, Ap Bjp, Ap Game, Bjp, Chandrababu, Jagan, Janasena, Naren

మరి ఆనాడు ఒక వ్యూహం ప్రకారమే టీడీపీని ఓడించిన బీజేపీ 2024 ఎన్నికల ముందు భుజం కాసి గెలిపిస్తుంది మరిన్ని దశాబ్దాలు ఏపీని టీడీపీ చేతిలో ఉండేలా చేస్తుంది అన్నది ఎవరైనా అనుకుంటే అది పూర్తిగా పొరపాటు ఆలోచన.అందుకే బీజేపీ ఒకసారి విపక్షంలోకి వచ్చిన టీడీపీని మరింత ఉనికిలో లేకుండా చేయాలని చూస్తోంది.టీడీపీ ఓటు బ్యాంక్ బీజేపీ ఓటు బ్యాంక్ ఒక్కటే.అందువల్ల టీడీపీ ఎంతలా పతనం అయితే అంతలా బీజేపీ బలపడుతుంది.దానికోసమే టీడీపీని 2024 ఎన్నికల్లో ఒంటరి చేయడానికి చూస్తోంది.ఇక టీడీపీ ఆర్ధిక వనరుల మీద కూడా దెబ్బ తీస్తుంది అని అంటున్నారు.

ఇక జనసేనకు జవసత్వాలు కూడా అందిస్తుంది.ఆ విధంగా పవన్ గ్లామర్ బీజేపీ వ్యూహాలతో 2024 నాటికి టీడీపీని నెట్టి ప్రధాన ప్రతిపక్షం సీట్లోకి ఈ రెండు పార్టీలు రావాలన్నది బీజేపీ పక్కా ప్లాన్.

ఆ మీదట ఓడిన టీడీపీ మరింతగా పతనం అవుతుంది.అపుడు అందులో ఉన్న వారు అంతా కూడా బీజేపీలోకే వచ్చి చేరుతారు.

జాతీయ స్థాయిలో బలమైన పార్టీ కాబట్టి బీజేపీకి ఆ అడ్వాంటేజ్ ఉంది.

Telugu Amith Shah, Ap, Ap Bjp, Ap Game, Bjp, Chandrababu, Jagan, Janasena, Naren

ఇక చంద్రబాబు ఇప్పటికే ఏడు పదుల వయసు దాటి ఉన్నారు.ఆయన కనుక 2024 ఎన్నికల్లో ఓడిపోతే పార్టీని పూర్తి సామర్ధ్యంతో నడిపించలేరు.బాబు తరువాత అంతటి దీక్షాదక్షుడు కూదా టీడీపీలో ఎవరూ లేరు.

దాంతో టీడీపీ ప్రాభవం గతం అవుతుందని అది తమకు ఉపకరిస్తుంది అని బీజేపీ ఆలోచన.ఇక 2024 నుంచి ప్రదాన ప్రతిపక్షంగా ఉంటే 2029 నాటికి ఏపీలో అధికారంలోకి రావడానికి తమకు వీలు అవుతుందని బీజేపీ ఈ త్రిముఖ వ్యూహాన్ని రూపకల్పన చేసింది అని అంటున్నారు.

అంటే సూక్ష్మంగా చెప్పుకోవాలీ అంటే టీడీపీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీని దెబ్బేయడానికి బీజేపీ ఇపుడు వైసీపీని పరోక్షంగా జనసేనను ప్రత్యక్షంగా వాడుకోవాలని చూస్తోంది అన్న మాట.ఒక్కసారి బీజేపీ కనుక ఏపీలో బలపడితే మరే ప్రాంతీయ పార్టీ కూడా అక్కడ బలపడే చాన్స్ అసలు లేదు అన్నది చరిత్ర చెప్పే నిజం.సో ఏపీలో బీజేపీ త్రిముఖ వ్యూహం సక్సెస్ ఎంతవరకూ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube