బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ఈనెల 25వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు.
పర్యటనలో భాగంగా నాగర్ కర్నూల్ బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు.అటు అమిత్ షా పర్యటన కూడా త్వరలోనే ఖరారు అయ్యే అవకాశం ఉంది.
ఈ క్రమంలో వాయిదా పడిన పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని బీజేపీ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.బండి సంజయ్ ను మార్చేది లేదని ఇప్పటికే జాతీయ నాయకత్వం స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే.
పార్టీలో ముఖ్య నేతలు అందరికీ కీలక బాధ్యతలు ఉంటాయని పార్టీ అధిష్టానం వెల్లడించింది.