వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.బీసీలను మోసం చేసి వైసీపీ సర్కార్ బీసీ సభ పెట్టిందని ఆరోపించారు.నిధులు, వనరులు లేకుండా బీసీ కార్పొరేషన్లు పెట్టి మోసం చేశారన్నారు.50 శాతానికి పైగా ఉన్న బీసీలకు వైసీపీ ఎన్ని సీట్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
చేనేత, పద్మశాలి, యాదవులకు టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు.ఏపీలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం జరుగుతోందన్నారు.అలంకార ప్రాయమైన పదవులతో బీసీలకు ఒరిగేదేమీ లేదని వెల్లడించారు.