తెలంగాణలో బీజేపీ వరుస షాక్ లు తగులుతున్నాయి.ఆ పార్టీకి రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో జేపీ నడ్డాకు రాపోలు లేఖ రాశారు.బీజేపీ తీరుపై రాపోలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అదేవిధంగా చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ విధించడంపై కూడా అసంతృప్తిగా ఉన్న రాపోలు.సంక్షేమ పథకాలను ఉచితాలు అనడం సరికాదని లేఖలో పేర్కొన్నారు.
పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వలేదని, ఎన్నోసార్లు అవమానించారని వాపోయారు.గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో జాతీయ స్థాయిలో తనను విస్మరించారని తెలిపారు.
ఈ క్రమంలోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు.అయితే, ఇటీవలే రాపోలు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.
ఈ క్రమంలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన కొనియాడారు.ఈ నేపథ్యంలో త్వరలోనే రాపోలు గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
.