టీమిండియా తో ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టు చాలా నిరాశ కి లోనైంది.ఎందుకంటే ఆ మ్యాచ్లో దాదాపు మేమే గెలుస్తాము అనుకునేటప్పుడు మన కింగ్ కోహ్లీ తన క్లాస్ ఆటతీరుతో వారి విజయాన్ని దూరం చేసాడు.
అలా ఓడిపోయి నిరాశతో ఉన్న జట్టును ముందుండి ఉత్తేజపరిచి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్‌దే.దాయాది దేశాలు అయిన ఇండియా, పాకిస్తాన్ రెండు జట్ల మధ్య చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ప్రత్యక్షంగా మ్యాచ్ చూస్తున్నవారే కాకుండా టీవీల ముందు చూస్తున్నవారు కూడా ఎంతో ఒత్తిడికి గురయ్యారు.
రెండు జట్ల క్రీడాకారులు విజయం కోసం చివరి బంతి వరకూ పోరాడిన పోటీలో విజయం ఒకరినే వరిస్తుంది.ఈ మ్యాచ్‌లో అద్భుతంగా పోరాడిన విరాట్ కోహ్లీ వల్ల గెలుపు భారత్ జట్టు ను వరించింది.
గెలుపు కోసం పాక్ క్రీడాకారులు చివరి వరకూ పోరాడినా, కానీ విజయం మాత్రం భారత్‌వైపే నిలిచింది.దీంతో పాకిస్తాన్ క్రీడాకారులు నిరాశతో కుంగిపోయారు.దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానాన్ని కూడా నిరాశగానే బయటికి వెళ్లడం, గుర్తించిన కెప్టెన్ బాబర్ డ్రెస్సింగ్ రూంలో క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు.

కెప్టెన్ బాబర్ కూడా బాధలో ఉన్నా తన బాధను దిగమింగుకుని జట్టు సభ్యులను తర్వాత మ్యాచ్‌కు సన్నద్ధం చేసే బాధ్యతను తీసుకున్నాడు.భారత్ తో మ్యాచ్లో మనం అందరం బాగా ఆడాం, కానీ ఫలితం మాత్రం నిరాశపరిచింది.ఓటమికి ఏ ఒక్కరూ బాధ్యులు కాదు, మరి దానికి బాధపడాల్సిన అవసరం లేదు.
మధ్య లో కొన్ని తప్పులు చేశాం.వాటి నుంచి గుణపాఠం నేర్చుకుని తర్వాత మ్యాచ్కు సిద్ధం అవుదాం.
మనం అందరం మిగతా మ్యాచ్లలో పోరాడితే కచ్చితంగా గెలుస్తాం, అంటూ జట్టు సభ్యులందరిలో ధైర్యం నింపాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







