మన్నెగూడలో బీజేపీ ముఖ్యనేతల సమావేశాలనికి బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్నర్ మీటింగ్స్ తో చరిత్ర సృష్టిస్తామని తెలిపారు.
తెలంగాణలో బీజేపీ బలపడుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు.ప్రజలు బీజేపీని ఆదిరిస్తున్నారన్న ఆయన బీజేపీ కార్యకర్తలకు కేసులకు భయపడరని తెలిపారు.
కృష్ణా జలాలను ఏపీకి అప్పగించిన చరిత్ర కేసీఆర్ ది అని విమర్శించారు.అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
అదేవిధంగా కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు.బీఆర్ఎస్ కు కాంగ్రెస్ అమ్ముడుపోయిందని ఆరోపించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
.