అచ్చం పక్షిని పోలిన మామిడి కాయ... చూడటానికి ఎగబడుతున్న జనాలు!

ఈ ప్రకృతిలో జీవించే జీవరాసుల మధ్య వైవిధ్యం ఉన్నప్పటికీ, ఒకేజాతికి చెందిన జీవరాసులలో మాత్రం పెద్దగా వైవిధ్యం కనిపించదు.అయితే అరుదుగా వాటి ఆకారాల్లో మాత్రం కొన్ని రకాల మార్పులను, చేర్పులను మనం చూడవచ్చును.

 Bird Like Mango , Mango , Bird ,viral Latest , News Viral , Social Media , Mang-TeluguStop.com

మనం చూస్తూ ఉంటాం.ఒకే చెట్టుకు కాసిన కాయలు ఒకేలా ఉన్నప్పటికీ చాలా అరుదుగా మాత్రమే కొన్ని కాయలు విచిత్రమైన ఆకారాల్లోకి మారుతాయి.

అలాంటి అరుదైన రూపంతో ఉన్న మామిడి కాయ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్తగా మారింది.

వివరాల్లోకి వెళితే.

చిత్తూరు జిల్లా, పుత్తూరు రూరల్ మండలం, గోపాలపురం ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం రాజు మామిడితోటలో తోతాపురి మామిడికాయ చూపరులను ఆకర్షిస్తోంది.ఆ వింత ఆకారాన్ని చూడటానికి స్థానికులు క్యూలు కడుతున్నారు.

అది మిగతా మామిడికాయల మాదిరి కాకుండా పొడవాటి మెడ.వెనక తోకతో చూడటానికి అచ్చం ఓ పక్షి మాదిరి ఆకారంలో ఆకట్టుకుంటుంది.ఇక ఈ పక్షి మామిడి కాయను చూస్తూ అక్కడ ప్రజలు భలే ఉందే మామిడి కాయ.అచ్చం పక్షిలాగా వుంది… అంటూ.ఆశ్చర్య పోతున్నారు.

Telugu Bird, Chittoor, Gopalapuram, Mango, Mango Bird, Tothapuri Mango, Latest-L

ప్రకృతిలో ఇలాంటి వింతలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.అలాంటివాటిని చూసి మనిషి ఆశ్చర్యపోవడం తప్ప, చేసేదేమి ఉండదు.అయితే కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం ఇలాంటివి జరిగినపుడు తీక్షణంగా పరిశీలిస్తారు.

జీవరాశి జీవనక్రమంలో ఇలాంటివి జరగడం పట్ల వారు అనేక పరిశోధనలు జరిపి దానికి గల కారణాలను తెలియచెబుతారు.అయితే ఇలాంటివి మనచుట్టూ కూడా అనేక సంఘటనలు జరగడం మనం చూస్తూవున్నాము.

ఇలాంటి మార్పులు ఎక్కువగా కాయగూరలలో మనం చూడవచ్చును.ముఖ్యంగా సొరకాయలలో అనేక ఆకృతులను మనం చూడవచ్చును.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube