VJ Sunny: బిగ్ బాస్ సన్నీ అన్ని సార్లు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారా…అసలేం జరిగిందంటే?

బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు వీజే సన్నీ (VJ Sunny) ఒకరు.ఈయన ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో నటించారు అంతకుముందు మీడియా రిపోర్టర్ గా కూడా పనిచేశారనే సంగతి మనకు తెలిసిందే.

 Bigg Boss Vj Sunny Break Up Love Story-TeluguStop.com

ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సన్నీ బిగ్ బాస్(Bigg Boss) సీజన్ 5 కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం అందుకున్నారు.ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నటువంటి ఈయన చివరికి విన్నర్ (Winner) గా నిలిచారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో గెలుపొందినటువంటి సన్నికి సినిమా అవకాశాలు వచ్చాయి.ఇలా ప్రస్తుతం ఈయన పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Telugu Bigg Boss Sunny, Break, Love Story, Tollywood, Vjsunny, Vj Sunny-Movie

త్వరలోనే సన్నీ నటించిన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.ఈ ఇంటర్వ్యూలలో భాగంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు.అందరూ బిగ్ బాస్ కార్యక్రమం స్క్రిప్ట్ అనుకుంటారని అయితే అది స్క్రిప్ట్ కాదని తెలిపారు.ఇక బిగ్ బాస్ నుంచి తాను గెలుచుకున్నటువంటి సగం డబ్బులు టాక్స్ రూపంలో గవర్నమెంట్ కట్ చేసుకుని మిగిలిన డబ్బు మాత్రమే నాకు ఇచ్చారని ఈయన తెలిపారు.

ఇలా ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి సన్నీ గురించి గత కొద్దిరోజుల క్రితం ఒక వార్త వైరల్ గా మారింది.

Telugu Bigg Boss Sunny, Break, Love Story, Tollywood, Vjsunny, Vj Sunny-Movie

కొన్ని కారణాలవల్ల సుమారు నాలుగు ఐదు సార్లు సూసైడ్ చేసుకోవాలని భావించారంటూ వార్త వైరల్ గా మారింది.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఇదే ప్రశ్న ఎదురు కావడంతో అసలు విషయం బయట పెట్టారు.తాను సూసైడ్ చేసుకోబోయాను అంటూ వచ్చినటువంటి వార్తలు పూర్తిగా ఆవాస్తవమని సన్ని ఆ వార్తలను తప్పుపట్టారు నేను ఎప్పుడు సూసైడ్ చేసుకోలేదని అలాంటి ఆలోచనని కూడా నా దరికి రానివ్వనని తెలిపారు.

అయితే ఒకసారి మాత్రం పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి కాస్త సమయం పట్టిందని తెలిపారు.

Telugu Bigg Boss Sunny, Break, Love Story, Tollywood, Vjsunny, Vj Sunny-Movie

దేవుడు మనకు ఈ జీవితాన్ని ఒకే ఒక్కసారి ఇస్తారు ఇలాంటి జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి తప్ప సూసైడ్ చేసుకోవాలని అనుకోకూడదు నేనెప్పుడూ కూడా అలాంటి ఆలోచన చేయను ఒకవేళ ఎవరికైనా అలాంటి ఆలోచన వచ్చిన వెంటనే ఒక్కసారి మీ ఫ్యామిలీని గుర్తు చేసుకోండి అంటూ ఈయన చెప్పారు.దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని ఆయన తీసుకువెళ్లే వరకు ఎంజాయ్ చేస్తానే తప్ప సూసైడ్ అనే ఆలోచన దరికి కూడా రానివ్వనని సన్నీ తెలిపారు.ఇక తనకు పెళ్లి జరిగిందంటూ కూడా వార్తలు వచ్చాయి అనగా నాకు ఎలాంటి పెళ్లి జరగలేదని సమాధానం చెప్పారు.

పోనీ లవర్ ఉన్నారా అంటూ ఈయనకు మరో ప్రశ్న ఎదురయింది.తనకు లవర్( Lover ) కూడా ఎవరు లేరని ఒకప్పుడు ఒక అమ్మాయి పట్ల అట్రాక్షన్ ఉండేదే తప్ప ఇప్పటివరకు లవ్ లేదంటూ ఈ సందర్భంగా సన్నీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube