ఏపీలో మత్స్యకార కుటుంబాలకు సీఎం జగన్ నిధులను విడుదల చేశారు.ఈ మేరకు ఓఎన్జీసీ పైప్ లైన్ వలన నష్టపోయిన మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించారు.
క్యాంప్ ఆఫీస్ నుంచి నిధులను సీఎం జగన్ వర్చువల్ గా విడుదల చేశారు.ఈ క్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని మొత్తం 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్లను విడుదల చేశారు.పైపు లైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు నెలకు రూ.11,500 చొప్పున ఆరు నెలలకు గానూ రూ.69,000 చొప్పున మొత్తం రూ.161.86 కోట్లను సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు.







