అతనికే ఓటేయండని కోరుతున్న మోనాల్...

స్టార్ మా ఛానెల్ లో విజయవంతంగా ప్రసారమవుతున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో నుంచి 14వ వారం మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ దత్తపుత్రికగా పేరు తెచ్చుకున్న మోనాల్ చాలా వారాల క్రితమే ఎలిమినేట్ కావాల్సి ఉన్నా గ్రాండ్ ఫినాలేకు వారం రోజుల ముందు ఎలిమినేట్ అయింది.

 Bigg Boss Contestant Monal Supports Another Contestant Akhil,bigg Boss Contestan-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో మొదట ఎంట్రీ ఇచ్చిన మోనాల్ చివరి వారం ఎలిమినేషన్ లో ఎలిమినేట్ కావడం గమనార్హం.
మోనాల్ గజ్జర్ రెండు సినిమాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో అంతే మొత్తం బిగ్ బాస్ షో ద్వారా దక్కిందని సమాచారం.

బిగ్ బాస్ నిర్వాహకులతో ఆమెకు ఉన్న ఒప్పందం వల్లే ఆమె ఇన్నిరోజులు హౌస్ లో ఉందని.ఎలిమినేట్ అవుతానని ముందే తెలియడం వల్ల ఎలిమినేషన్ సమయంలో మోనాల్ బాధ పడలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇకపోతే బయటకు వచ్చిన తరువాత మోనాల్ అఖిల్ కు తన మద్దతు ప్రకటించడంతో పాటు అఖిల్ విన్నర్ కావడం కోసం కృషి చేస్తోంది.

Telugu Akhil, Ariyana, Bb, Biggboss, Monal Gajjar-Latest News - Telugu

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ నర్మదగా పేరు తెచ్చుకున్న మోనాల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో ప్రతి విషయంలో అఖిల్ తనను సపోర్ట్ చేశారని తాను అఖిల్ ను సపోర్ట్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.అఖిల్ కు ఓట్లు వేయాలని తన అభిమానులను ఆమె కోరారు.అదే సమయంలో మరికొందరు కంటెస్టెంట్ల గురించి మోనాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అరియానాకు బిగ్ బాస్ టైటిల్ గెలిచే అర్హత లేదని చెప్పారు.

Telugu Akhil, Ariyana, Bb, Biggboss, Monal Gajjar-Latest News - Telugu

అరియానా టాస్కులు చేస్తానని గొప్పలు చెప్పుకుంటుందని ఆమె గొప్పగా చేసిన ఒక్క టాస్క్ అయినా ఉందా.? అని ప్రశ్నించారు.అరియానా మార్నింగ్ లేచి రెడీ అయ్యి పాటకు డ్యాన్స్ వేస్తుందని ఆ తరువాత మళ్లీ హౌస్ లోకి వెళ్లి నిద్రపోతుందని తెలిపింది.

గ్రాండ్ ఫినాలేకు మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో ఎవరికి వాళ్లు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను గెలిపించుకోవడం కోసం ఎక్కువ సంఖ్యలో ఓట్లు పోల్ అయ్యేలా చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube