సినిమాల్లో తనదైన సత్తా చాటి రాజకీయాల్లో కూడా చక్రం తిప్పడానికి సిద్ధమైంది విజయశాంతి( Vijayashanti ) .గత కొద్ది రోజులుగా బీజేపీ లో కొనసాగుతున్న విజయశాంతి పార్టీ తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేస్తుంది.
ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేస్తూ పార్టీ వీడబోతున్నట్లు పరోక్షంగా సూచనలు ఇస్తుంది.ఇక ఇప్పటికే బీజేపీ పార్టీలో బండి సంజయ్ ( Bandi Sanjay ) పదవి నుండి తప్పుకున్నాక చాలామంది సీనియర్ నేతలు పార్టీలో ఉండడం లేదు.
అలాగే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది బీజేపీ నుండి అగ్ర నేతలందరూ కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నారు.ఈ మధ్యనే కోమటిరెడ్డి,వివేక్ వెంకటస్వామి వంటివాళ్లు జంప్ అయ్యారు.
అలాగే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ( Konda vishweshwar reddy ) కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం.ఇక గత కొద్ది రోజులుగా విజయశాంతి కూడా కాంగ్రెస్ లోకి వెళుతుందని ప్రచారం జరుగుతుంది.అయితే ఈ ప్రచారం జరగడానికి ప్రధాన కారణం విజయశాంతి బీజేపీ పార్టీ ప్రచారానికి చాలా దూరంగా ఉంటుంది.అంతే కాదు అమీత్ షా, మోడీలు రాష్ట్రంలో పర్యటించిన వేల కూడా రాములమ్మ ఎక్కడా కూడా కనిపించలేదు.
అలాగే పరోక్షంగా బిజెపిపై అసహనం వ్యక్తం చేస్తుంది.ఇక రెండు రోజుల క్రితం కొంతమంది కాంగ్రెస్ ( Congress ) లో ఉండమంటున్నారు కొంత మంది బిజెపిలో ఉండమంటున్నారు కానీ రెండు పార్టీల లక్ష్యం తెలంగాణ ని మేలుకోల్పడమే.
కానీ సినిమాల్లో చేసినట్టు డబల్ యాక్షన్ రాజకీయాలు చేయలేను అంటూ ట్వీట్ చేసింది.ఇక ఈ ట్వీట్ అసలు ఉద్దేశం ఏంటో తెలియక అందరూ తలలు గోక్కున్నారు.
అంతేకాకుండా బిజెపి విడుదల చేసిన మూడు జాబితాల్లో ఎక్కడా కూడా విజయశాంతి పేరు లేదు.
ఇక విజయశాంతి పార్టీ నుండి తప్పుకుబోతుందనే సమాచారం వారికి తెలిసే ఆమెకు సీటు కేటాయించడం లేదని తెలుస్తోంది.అయితే తాజాగా విజయశాంతి కూడా కాంగ్రెస్ లోకి రాబోతుంది అని మీడియాలో ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే అధిష్టానం నుండి విజయశాంతికి పిలుపు వచ్చిందని,రేవంత్ రెడ్డి ( Revanth reddy ) కూడా విజయశాంతికి భారీ ఆఫరిస్తున్నట్టు మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
విజయశాంతి కాంగ్రెస్ లోకి వస్తే పదవి ఇస్తామని ఆశ చూపుతున్నారట.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ నుండి ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫరిస్తున్నట్టు సమాచారం.మరి విజయశాంతి బీజేపీ లోనే ఉంటుందా.లేదా కాంగ్రెస్ లోకి వస్తుందా అనేది మరో రెండు మూడు రోజుల్లో బయటపడనుంది.