షణ్ముఖ్ మరియు నా గురించి చాలా అసహ్యంగా రాసారు... నా పెళ్లెప్పుడంటే ...

ఈ మధ్యకాలంలో కొందరు సినీ సెలబ్రిటీల గురించి నెగిటివ్ గా ప్రచారాలు చేస్తూ పాపులర్ కావాలని చూస్తున్నారు.ఈ క్రమంలో నిజాలు తెలుసుకోకుండా సినీ సెలబ్రిటీల మధ్య ఉన్నటువంటి సన్నిహిత బంధాలను కూడా అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వారి మధ్య ఏదో ఉంది అంటూ తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు.

 Big Boss Contestant Siri Hanmanth React About Shanmukh Negative Trolls, Shanmukh-TeluguStop.com

దీంతో సినీ సెలబ్రిటీలు వారి యొక్క వ్యక్తిగత జీవితాలలో మాత్రమే కాకుండా వృత్తి పరంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.అయితే ఇటీవలే ప్రముఖ సీరియల్ హీరోయిన్ మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి హనుమంతు తన గురించి కొందరు చేస్తున్నటువంటి ప్రచారాలపై స్పందిస్తూ ఫైర్ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళితే తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్  విజయవంతంగా ఐదవ సీజన్ ని ఇటీవలే పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ సీజన్ విజేతగా ప్రముఖ సీరియల్ హీరో మరియు వీడియో జాకీ సన్నీ ప్రకటించబడ్డాడు.అయితే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ సీరియల్ నటి మరియు యూట్యూబర్ సిరి హనుమంతు తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా ఈ మధ్య కొందరు తన గురించి యూట్యూబ్లో మరియు పలు వెబ్ సైట్ లలో అసభ్యకరంగా చిత్రీకరించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఎమోషనల్ అయ్యింది .ఈ క్రమంలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి షణ్ముఖ్ తో తనకున్నటువంటి రిలేషన్ గురించి అసభ్యకరంగా వార్తలు మరియు గాసిప్స్ సృష్టించారని పేర్కొంది.అలాగే షణ్ముఖ్ తనకు మంచి స్నేహితుడని అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తనకు ఎంతగానో సహాయం చేశాడని అలాంటి వ్యక్తి గురించి చెడుగా ప్రచారం చేయొద్దని కోరింది.అంతేగాక షణ్ముఖ్ కి తన లైఫ్ పై చాలా క్లారిటీ ఉందని అలాగే తన లైఫ్ పై కూడా తనకు చాలా క్లారిటీ ఉందని తెలిపింది.

అలాగే తాను తన అభిమానుల వల్లే టాప్ ఫైవ్ లో నిలిచానని అందుకు తనకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.ఇక తన పెళ్లి గురించి స్పందిస్తూ తన ప్రియుడు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు పెళ్ళికి తాను సిద్ధమని తన అభిప్రాయం తెలిపింది.

అలాగే ఇప్పుడిప్పుడే తాను సెట్ చేసుకునే పనిలో పడ్డామని కాబట్టి పరిస్థితులు చక్కబడిన తర్వాత పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పుకొచ్చింది.అలాగే సిరి తల్లి కూడా ఈ విషయంపై స్పందిస్తూ సిరి లాంటి కూతురు ఉన్నందుకు గర్వపడుతున్నానని తెలిపింది.

అలాగే ఎవరెన్ని చెప్పినా కూడా తన కూతురు గురించి తనకు చాలా బాగా తెలుసని దాంతో ఇతరులు తప్పుడు ప్రచారాలను తాను అసలు నమ్మనని స్పష్టం చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి సిరి హనుమంతు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది.తన చదువు పూర్తయిన తరువాత నటనపై మనసు మళ్లడంతో కొంతకాలం పాటు న్యూస్ రీడర్ గా కూడా పనిచేసింది.ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.ప్రస్తుతం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినటువంటి జీ తెలుగు లో ప్రసారమయ్యే ఓ ప్రముఖ ధారావాహికలో హీరోయిన్ గా కూడా నటిస్తోంది.

Bigg Boss5 Siri About Negative Trolls

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube