అమెరికాలో ఎన్నారైలు తెగ ఎంజాయ్ చేస్తారు.ఒక్కసారి అమెరికా వెళ్ళాక భారత దేశం ఎలా ఉంది, సొంత ఊరు ఎలా ఉంది, అసలు తమ ఇళ్ళలో ఉండే వాళ్ళని అయినా ఎన్నారైలు పట్టించుకుంటున్నారా , లేక విలాసవంతమైన జీవితాలని అనుభవిస్తూ అన్నీ గాలికి వదిలేశారా అంటూ ఎన్నో ఎన్నెన్నో కామెంట్స్ ఎన్నారైలపై చేస్తుంటారు చాలా మంది సహోదరులు.
కానీ ఏ దేశమేగినా ఎందు కాలిడినా నా సంస్కృతీ సాంప్రదాయలని ప్రాణంగా భావిస్తాము అంటున్నారు ఎన్నారైలు.
ఎంతో బిజీ లైఫ్ గడుపుతున్నా సరే ఏకాక్డా కూడా తెలుగు సాంప్రదాయలని పక్కన పెట్టకుండా తెలుగు వెలుగుని పంచడంలో ఎప్పుడూ ముందు ఉంటారు.
ఈ కోవలోనే అమెరికాలో మన ఎన్నారైల పిల్లలకి తెలుగు నేర్పడానికి ఏర్పాటైన మనబడి ఎంతో మందికి పిల్లలకి తెలుగుని మాత్రమే కాదు, తెలుగు సంస్కృతీ, సాంప్రదాయాలు, పండుగల విశిష్టత ని తెలుగుపుతూ వారిని కూడా భాగస్వాములని చేస్తోంది.వివరాలోకి వెళ్తే.
అమెరికాలోని డల్లాస్ సిటీలో ఉన్న మనబడి పాటశాలలో తెలుగు నేర్చుకుంటున్న ఎన్నారైల పిల్లలచే మనబడి నిర్వాహకులు భూకైలాస్ నాటకం వేయించారు.ఈ నాటకంలో పిల్లలు అందరూ ఎంతో అద్భుతంగా నటించడం తల్లి తండ్రులని ఆశ్చర్య పరిచింది.పాత్రలకి తగ్గట్టుగా వేషాలు వేసుకుని నాటకంలో నటించిన తీరు అందరిని ఆకట్టుకుంది.ఈ విషయం పై స్పందించిన మనబడి యాజమాన్యం చిన్నతనం నుంచీ పిల్లలకి రామాయణం, భారతం, భూకైలాస్, భగవద్గీత వంటి వాటిని పిల్లలకి తెలియచేయాలని అప్పుడే భవిష్యత్తులో సైతం మన సాంప్రదాయాలు బ్రతికి ఉంటాయని తెలిపారు.
భారత దేశం ఇంకా గొప్ప దేశంగా ఉందంటే అందుకు కారణం మన ఆచార సాంప్రదాయలేనని అన్నారు.