పవన్ కళ్యాణ్ హీరో గా రానా విలన్ గా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.సినిమా మొదటి వారం రోజు ల్లో ఏకంగా రూ.140 కోట్ల వసూళ్ల ను దక్కించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఈ వారం రెండు సినిమా లు విడుదల అయిన నేపథ్యం లో భీమ్లా నాయక్ సినిమా ను జనాలు పట్టించుకుంటారో లేదో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
కానీ నేడు విడుదలై ప్రేక్షకుల ముందుక వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.ఆ రెండు సినిమా లకు కూడా మొదటి రోజే నెగటివ్ టాక్ వచ్చేసింది.
దాంతో సినిమా లకు వసూళ్లు పెద్దగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ఆ సినిమా ల ప్లాప్ తో ఈ వీకెండ్ లో కూడా కచ్చితంగా భీమ్లా నాయక్ సినిమా సందడి చేయడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భీమ్లా నాయక్ సినిమా వసూళ్లు మరో పాతిక నుండి ముప్పై కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.నేడు విడుదల అయిన రెండు సినిమాల్లో కనీసం ఒక్క సినిమా సక్సెస్ అయితే ఇంత భారీ వసూళ్లు వచ్చి ఉండేవి కావేమో అని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
శివరాత్రి సందర్భం గా హౌస్ ఫుల్ అయిన భీమ్లా నాయక్ థియేటర్లు మళ్లీ ఈ శని ఆదివారాలు ఖచ్చితంగా భారీ వసూళ్లను దక్కించుకొని నిర్మాత కు మరియు బయ్యర్ల కు భారీగా వసూళ్లను కట్ట బెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.